రాష్ట్ర కార్యదర్శి గా జక్కుల చంద్రశేఖర్

viswatelangana.com
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన జక్కుల చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం హరిహర కళాభవన్ హైదరాబాద్ నందు జరిగింది. తెలంగాణ పద్మశాలి సంఘ అభ్యున్నతికి , సమాజహిత కార్యక్రమాలు చేస్తున్న కృషిని గుర్తించి కార్యదర్శి బాధ్యతలు అందచేసిన వారికి,నియామకానికి సహకరించిన టిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వల్లకటి రాజ్ కుమార్, రాష్ట్ర సంఘ గౌరవ సలహాదారులు భోగ వెంకటేశ్వర్లు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లకు చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. వీరు మాట్లాడుతూ పద్మశాలి అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పద్మశాలి సంఘ రాష్ట్ర కార్యదర్శిగా జక్కుల చంద్ర శేఖర్ నియామకం పట్ల జగిత్యాల జిల్లా ప్రాంత పద్మశాలి బాంధవులు, భూపతిపూర్ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.



