కథలాపూర్
రాష్ట్ర యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ ప్రారంభం

viswatelangana.com
May 1st, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ రూపొందించిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో మే నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఊట్ పల్లిలో ఉచిత వేసవి శిక్షణ నిర్వహించనున్నట్లు కోచ్ ముదాం ప్రవీణ్ తెలిపారు యుపిఎస్ ఊట్ పల్లి స్కూల్లో ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు మహేందర్ భాస్కర్ ప్రవీణ్ ప్రశాంత్ దినేష్, రతీష్ బన్నీ మధు అజయ్ తదితరులు పాల్గొన్నారు.



