మెట్ పల్లి
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ప్రగతి విద్యార్థి

viswatelangana.com
March 15th, 2025
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శుక్రవారం రోజు నిర్వహించబడిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలకు చెందిన పస్తం విష్ణు 100 మీటర్ల పరుగు పందెంలో అద్భుత ప్రతిభను కనబరిచి,ఈనెల 23న హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా విష్ణును పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్, కరస్పాండెంట్ జయశ్రీ, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, పాఠశాల పి ఈ టి మహేష్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.



