కోరుట్ల

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన సిద్దార్థ స్కూల్ విద్యార్థిని

viswatelangana.com

February 11th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా పలు విభాగాల్లో నిర్వహించిన పోటీలకు జిల్లా నుండి 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కాగా పెయింటింగ్ విభాగం నుండి రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనుటకు పట్టణంలోని సిద్ధార్థ హైస్కూల్ లో చదువుతున్న అల్లె హర్షిత ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ బాలాజీ దామోదర్ తెలిపారు. కాగా జిల్లా సైన్స్ అధికారి బాజోజి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఒక్కో విభాగం నుండి ముగ్గురు చొప్పున 12 మందిని, న్యాయనిర్ణీతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన హర్షితను ఈ సందర్బంగా కరస్పాండెంట్ దామోదర్, ఉపాధ్యాయులు పలువురు అభినందించారు.

Related Articles

Back to top button