కోరుట్ల
రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించండి
viswatelangana.com
February 7th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
- కమిషనర్ కు వినతిపత్రం సమర్పించిన కాలనీవాసులు
కోరుట్ల పట్టణ 29వ వార్డు ఎల్ఐసి కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి మిషన్ భగీరథ పైప్లైన్ కోసం తవ్విన తవ్వకాల్లో రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయి టూ వీలర్ కూడా ఆ రోడ్డు గుండా వెళ్లలేని పరిస్థితి ఉంది దీనివలన ఎల్ఐసి కాలనీవాసులు అలాగే అదే ప్రాంతంలో పలు ఆసుపత్రులకు వచ్చిపోయే రోగులకు చాలా ఇబ్బందికరంగా మారింది కావున వెంటనే ఇట్టి రోడ్డు మరమ్మతులు చేపట్టి కాలనీవాసుల ఆసుపత్రులకు వచ్చి పోయే రోగుల ఇబ్బందులు తొలగించాలని కోరుతూ మంగళవారం కాలనీవాసులు బీసీ సంక్షేమ శాఖ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శికారి గోపికృష్ణతో కలిసి మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రాచకొండ చందు లక్ష్మణ్ సత్యం సాయి క్యాతం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు



