కోరుట్ల
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనవద్దు

viswatelangana.com
December 30th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సిఐ సురేష్ బాబు రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనవద్దని, సత్ప్రవర్తన కలిగి ఉండాలని సీఐ సురేష్ బాబు సూచించారు. డిసెంబర్ 31 వేడుకల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.



