లక్ష్మి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com
మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలోని పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీసీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కృష్ణారావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ధ్వజస్తంభ పునర్నిర్మాణ దాత బైరినేని ప్రదీప్ రావు దంపతులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజు సదానంద చారి, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, అంతడుపుల నరసయ్య, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మోతే రమేష్, ఏనుగు రాజారెడ్డి, నిమ్మల రాజేశం, మిట్టపల్లి రాజేశ్వర్ రెడ్డి, ఏనుగు రాజు, బొల్లారం వినోద్, వేములవాడ దేవరాజాం, సిలివేరి రాములు, పిడుగు తిరుపతిరెడ్డి, సత్యనారాయణ, పెరుమాండ్ల సత్యనారాయణ, నేమురి భూమయ్య, వాల్గొండ రాములు, డాక్టర్ బైర ఎల్లయ్య తదితరులు ఉన్నారు.