కోరుట్ల
వరిధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం

viswatelangana.com
October 22nd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏకీన్ పూర్ పరిధిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రలు సంగెం అలాగే నాగులపేట గ్రామాలలో కోరుట్ల శాసనసభ్యులు డా,, కల్వకుంట్ల సంజయ్ కుమార్, జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ అలాగే సహకార సంఘం అధ్యక్షులు సింగిరెడ్డి నర్సారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు చేపూరి జీవన్ రెడ్డి, సహకార సంఘ కార్యవర్గ సభ్యులు కొమ్ముల మోహన్ రెడ్డి, సుధవేణి శ్రీనివాస్, జక్కని గణేష్, కాటిపెల్లి గంగారెడ్డి, గడ్డం పద్మ, సహకార శాఖ ఏఆర్, జెఐ, కోరుట్ల ఎంపీడీఓ, ఏంఏఓ ఏఈవో, డీటీసీఏస్,లు స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల రైతులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.



