కోరుట్ల

వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాల సమర్పణ

viswatelangana.com

April 6th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

శ్రీరామనవమి సందర్భంగా కోరుట్ల పాత బజార్ లోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవానికి వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు, పూలు, పండ్లను సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వనిత క్లబ్ కోశాధికారి గుడిసె శివజ్యోతి మాట్లాడుతూ రామ నామ జపం చేసిన, విన్న జన్మ ధన్యం అవుతుందని, అలాంటిది రాములోరి కళ్యాణం లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వనిత క్లబ్ కార్యదర్శి ముత్యపు మంజుల, ఉపాధ్యక్షురాలు మోటూరి అర్పణ, మంచాల రాధ, డిస్టిక్ ఆఫీసర్ నీలి లక్ష్మి, జోనల్ చైర్మన్ శ్రీపతి వాణి వనిత క్లబ్ సభ్యులు మంచాల పద్మ, కొత్త శోభ, ఉత్తూరి భాగ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button