కథలాపూర్
విదార్థుల హాజరు శాతం పెంచడానికి వినూత్న కార్యక్రమం

viswatelangana.com
April 9th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
బొమ్మెన ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి కొరకు మార్చి నెలలో పాఠశాలకు వంద శాతం హాజరు అయిన 32 మంది విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు అంబటి రవి బహుమతులు అందించి అభినందించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు అంబటి రవి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ను ఈ విద్యా సంవత్సరం జూన్ – 2024 నుండి ప్రారంభించి ప్రతి నెల వంద శాతం హాజరైన విద్యార్థులకు బహుమతులు అందిస్తున్నాము. దీని వల్ల విద్యార్థుల హాజరు శాతం బాగా పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, సాయిరెడ్డి, శివకృష్ణ, ప్రశాంత్, శిరీష, శ్రావణి, వర్ణ, రాజేశ్వరి లు పాల్గొన్నారు.



