విద్యుత్ ప్రమాద బాధితులను పరామర్శించిన బీజేపీ నేత సురభి నవీన్ కుమార్

viswatelangana.com
కొరుట్ల పట్టణంలో ఇటీవల జరిగిన దురదృష్టకర విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం వైద్యులతో సమావేశమై, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన నవీన్ కుమార్, వారికి అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. అలాగే, ఈ విషాద ఘటనపై తన ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, మృతి చెందిన బాధితుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.



