కోరుట్ల

విమాన ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com

June 13th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

గుజరాత్ లోని అహమదాబాద్ నుండి లండన్ బయలుదేరిన విమానం కొద్ది క్షణాల్లోనే ప్రమాదానికి గురై విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అదే ప్రమాదంలో వైద్య విద్యార్థులు మృతి చెందడం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఘోరమైన ప్రమాదం అని అన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మ లకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జువ్వాడి కృష్ణారావు వెంట కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, మాజీ వార్డ్ కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, తదితరులు ఉన్నారు.

Related Articles

Back to top button