విశ్వశాంతి పాఠశాలలో భగవద్గీత సత్సంగం

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం లోని విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో భగవద్గీత సత్సంగం తరగతులను ఆధ్యాత్మిక వాతావరణంలో దైవచింతన భావనతో ప్రభుజి నందగోపాల్ ఆనందదాస్ అధ్వర్యంలో ప్రతివారం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా lప్రిన్సిపాల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ భగవద్గీత అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే క్రిష్ణార్జునులు.. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడికి క్రిష్ణుడు గీతను ఉపదేశం చేసినట్లు చాలా మందికి తెలుసు. అయితే తన కంటే ముందే గీత ఉపదేశం మరొకరు చేశారు. మహర్షి వేద వ్యాసుని ఆదేశాల మేరకు వినాయకుడు మహాభారత గ్రంథాన్ని రచించారు. ఈ సమయంలో వ్యాసుడు వినాయకుడకి గీతా బోధన చేశాడు. శ్రీ వినాయకుడితో పాటు మహర్షి వేద వ్యాసులు తన శిష్యులైన వైషాంపాయనుడు, జైమిని, పాలసంహితులకు మహాభారతంలోని లోతైన రహస్యాలను ఉపదేశించారు. అంతేకాదు మహర్షి వ్యాసుని ఆదేశం మేరకు వైషాంయపనుడు జనమేజయుడికి మహాభారతం గురించి వివరించాడు. ఈ సమయంలోనే తనకు మహాభారతం బోధించాడు అని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరమేష్, చైతన్యదాస్, నర్సయ్య ప్రభు, బాలాజీ దాస్ ప్రభు మరియు పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత విద్యాన్వేస్ ఉపాధ్యాయులు మహేష్, రంజిత్, సంజన, రజిత, మనీశా, స్రవంతి, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.



