భీమారం
వెంకట్రావుపేట గ్రామంలో సిసి రోడ్డు పనులు ప్రారంభం
viswatelangana.com
February 14th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
భీమరం మండలం వెంకట్రావుపేట గ్రామంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎం.ఎన్.ఆర్ ఈజీ.ఎస్ గ్రాంట్ నుండి 5 లక్షల నిధులతో వెంకట్రావుపేట గ్రామంలో పోతరాజు రాజలింగం ఇంటి దగ్గరి నుండి పోచమ్మ గుడి వరకు సిసి రోడ్డు పనులు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిసి రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయించినందుకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అజయ్, మండల మైనారిటీ అధ్యక్షులు ఎండి సయ్యద్, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రదీప్, ప్రేమ్, విజయ్, రంజిత్, అరుణ్ మరియు గ్రామ ప్రజలు తదిరులు పాల్గొన్నారు.



