కోరుట్ల
వైభవంగా శివ పార్వతుల కళ్యాణం

viswatelangana.com
September 14th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
వినాయక నవరాత్రుల సందర్బంగా పట్టణం లోని సంకల్ప విఘ్నేశ్వర ఆలయం లో ఆలయ ప్రధాన అర్చకులు దేషుముఖ్ ఫణీంద్ర శర్మ ఆధ్వర్యంలో మొదటగా పుణ్యాహ వాచానం, కలష స్థాపన చేసి ఉత్సవ మూర్థులకు ఫల పంచామృత అభిషేకాదులు జరిపి శివ పార్వతుల కళ్యాణం నిర్వహించారు అర్చకులు మాట్లాడుతూ ఆది దంపతుల కళ్యాణం జరిపించిన చూసినా కూడా ఫలం దక్కుతుందని నిరాకారుడు అయిన శివ తత్త్వం తెలుసుకోవడం వల్ల సమస్యలు అన్ని దూరమవు తాయని అన్నారు ఈ సందర్బంగా కన్యా దాతలుగా కస్తూరి రమేష్ దంపతులు వ్యవహారించారు. ఈ కార్యక్రమం లో సుదవేణి మహేష్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



