వ్యవసాయ అతిథి మహిళా అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం
viswatelangana.com
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల అగ్రికల్చర్ కళాశాల జగిత్యాల, కోరుట్ల ప్రాంతంలోని అల్లమయ్యగుట్ట మహిళా అతిథి అధ్యాపకుల నుండి ఈ క్రింది సబ్జెక్టులలో దరఖాస్తులు 1)ఏంటోమాలాజీ (కీటకాల శాస్త్రం), 2) జనటిక్స్ అండ్ ప్లాంట్ బ్రిడింగ్ (జన్యుశాస్త్రం మరియు మొక్కల పెంపకం), 3) హార్టికల్చర్ (హార్టికల్చర్), 4) ఆగ్రోనమీ (వ్యవసాయ శాస్త్రం), 5) అగ్రికల్చర్ ఎకనామిక్స్ (వ్యవసాయ ఆర్థిక శాస్త్రం) 6) అగ్రికల్చర్ ఇంజనీరింగ్ (వ్యవసాయ ఇంజనీరింగ్) బోధించుటకు అలాగే అసోసియేట్ డీన్ (అసోసియేట్ డీన్) గా పనిచేయుటకు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం అర్హత అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులను డెమో కొరకు 2024 సెప్టెంబర్ 27 న ఉదయం 10 గంటలకు కోరుట్లలోని అల్లమయ్య గుట్ట కళాశాలలో రిపోర్టు చేయాలని కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ గునుక శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు సెల్: 8374000563, 8639365500



