వ్యాయామ ఉపాధ్యాయుల మండల స్థాయి సమావేశం

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లోని ఎమ్మార్సీ లో రాయికల్ మండల క్రీడల నిర్వహణ గురించి మండల విద్యాధికారి గంగాధర్ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా 2024 సెప్టెంబర్ 2 న అండర్ 14 అలాగే 17 బాలికలకు కబడ్డీ, ఖొఖొ, వాలీబాల్, 2024 సెప్టెంబర్ 03 న అండర్ 14 అలాగే 17 బాలురకు కబడ్డీ, ఖొఖొ, వాలీబాల్, 2024 సెప్టెంబర్ 04 న అండర్ 14 మరియు 17 బాల, బాలికలకు అథ్లెటిక్స్ నిర్వహించబడును. అండర్ 14 బాల, బాలికలకు, 2011 జనవరి 01 అండర్ 17 బాల, బాలికలకు, 2008 జనవరి 01 తర్వాత జన్మించిన వారు అర్హులు… అండర్ 14 కబడ్డీ బాలికల బరువు 48 కిలోలు, అండర్ 14 బాలురకు 51 కిలోల బరువు, అండర్ 17 బాల, బాలికలకు 55 కిలోల బరువు లోపు వారు అర్హులు. ఈ క్రీడలలో పాల్గొను బాల, బాలికలు తప్పనిసరిగా పాఠశాల నుండి డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ ప్రధానోపాధ్యాయుల సంతకంతో రాగలరని, మిగతా వివరాలకు పి కృష్ణ ప్రసాద్ పిడి మండల కన్వీనర్ సెల్ నెంబర్ 9440037393 నీ సంప్రదించగలరు. ఈ సమావేశంలో మండల పీడీలు అలాగే పిఈటిలు పాల్గొన్నారు.



