శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com
కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ ఉత్సవాలలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు వెంట కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాళ్ళ సత్యనారాయణ, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎలేటి మహిపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు ఏలాల వెంకటరెడ్డి, డబ్బా రాజేష్, స్థానిక మాజీ ఎంపీటీసీ సభ్యులు కృష్ణారెడ్డి, పడాల లచ్చన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లారెడ్డి, దాసరి రాజేష్, బండి తిరుపతి, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.



