రాయికల్

శ్యాంప్రసాద్ ముఖర్జీ కి నివాళులు

viswatelangana.com

June 23rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్యాంప్రకాష్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుర్మా మల్లారెడ్డి మాట్లాడుతూ భారతదేశ ముద్దుబిడ్డ ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పరిస్థితులను ప్రపంచానికి అర్థం చేసే విధంగా ఉద్యమం నిర్వహించి ఏక్ దేశమే ధో నిశాన్ అనే విధానం ధో ప్రధాన్ నహి చలేగా నహి చలేగా అంటూ ఈ దేశంలో అమలుపరిచిన భారత రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు కాదు. భారతదేశానికి ప్రధానమంత్రి అంటారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కూడా అక్కడ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అని పిలవాలని మూడు రంగుల జెండాను మనం భారతదేశ పరిధిలో ఎగురవేస్తుంటే జమ్మూ కాశ్మీర్లో మాత్రం ప్రత్యేకమైనటువంటి జెండా నిర్వహించుకోవచ్చు అని ఆర్టికల్ 370 ద్వారా ఆ రోజున పాలకులు పెట్టిన ప్రత్యేక ఆర్టికల్ కు వ్యతిరేకంగా తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమం నిర్వహించి దేశాన్ని ఒకటి చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వెళ్లి మూడు రంగుల జెండా ఎగరవేస్తానన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి షేక్ అబ్దుల్లా ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో నిర్బంధించి అక్రమంగా వారిని జైల్లోనే హతం చేసినటువంటి సంఘటన భారతదేశ రాజకీయ లను ఆ రోజు కుదిపివేసింది. దీనికి నిరసనగా దేశం మొత్తం ఉద్యమించినటువంటి వ్యక్తులు అనేక మందిని ఆరోజు భారత ప్రభుత్వం అరెస్టు చేయడం జరిగింది. అనంతర కాలంలో భారతదేశానికి శ్రీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత 370 ఆర్టికల్ రద్దు చేయడం ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం జమ్మూ కాశ్మీర్లో మూడు రాష్ట్రాలుగా చేయడం అనంతరం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆరోజు ఉన్న శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదానం కారణంగానే జమ్మూ కాశ్మీర్ విముక్తి జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు కూనారపు భూమేష్, బన్న సంజీవ్, ఉపాధ్యక్షులు కడార్ల శ్రీనివాస్, చికోటి ఎల్లా గౌడ్ అల్లే నరసయ్య తాజా మాజీ ప్రధాన కార్యదర్శి కంబోజిరవి, భూత అధ్యక్షులు అంది శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button