శ్రీ ఓంకారేశ్వర(రాజరాజేశ్వర) స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్

viswatelangana.com
మేడిపల్లి మండల కేంద్రంలోని ఓంకారేశ్వర(రాజరాజేశ్వర) స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మహ శివరాత్రి పర్వదిన పునస్కరించుకొని శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహా అన్నదానం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలు, భాజా భజంత్రీలతో ఘన స్వాగతం పలికారు..స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా నలంద డిగ్రీ కాలేజ్ జగిత్యాల యొక్క ఎన్ని ఎస్ఎస్ వాలంటీర్స్ దేవస్థానంలో సేవ చేయడానికి వచ్చారు. వీరికి దీక్ష స్వాముల ఆధ్వర్యంలో ఆది శ్రీను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి, భీమారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి, సింగ్ రెడ్డి నరేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మార్గ నర్సిరెడ్డి, మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చేవూరి నాగరాజ్, బండారి రమేష్, ఉరుమట్ట నరసయ్య, బలిగం రాజేష్, నవీన్, మధుకర్, సాయి తేజ, మహేష్, భూమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.



