కోరుట్ల
శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు

viswatelangana.com
October 19th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలో అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హుండి లెక్కింపు శుక్రవారం చేపట్టారు. దేవదాయ శాఖ జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమౌళి సమక్షంలో లెక్కించారు. కాగా దేవాలయా హుండీలో 86 వేల 506 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో దేవాదాయ జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ ఎమ్. రాజమౌళి, ఈవో ఎమ్. విక్రం, పూజారి బి.నరసింహ చారి, జూనియర్ అసిస్టెంట్ పి. నర్సయ్య, సిబ్బంది గంగాధర్, రాజేందర్, శ్రీ లలిత సేవా ట్రస్టు సభ్యులు అలాగే భక్తులు పాల్గొన్నారు.



