కోరుట్ల
శ్రీ సరస్వతి శిశు మందిరంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

viswatelangana.com
October 1st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా తీరొక్క బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, మాతాజీలు, ఆచర్జీలు అలాగే కార్యదర్శి వనపర్తి చంద్ర మోహన్, కరస్పాండెంట్ నీలి శ్రీనివాస్, ప్రధానాచార్యులు గోపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.



