శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయం గుడిలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు కొండూరి వెంకటి వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం జువ్వాడి కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జువ్వాడి కృష్ణారావుకు ఆలయ అర్చకులు స్వామి వారి ప్రసాదం, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, కోరుట్ల పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మ్యకల నర్సయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు సహదేవ్, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తేలు రాజ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



