శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి రథోత్సవం
viswatelangana.com
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఉత్సవాల భాగంగా ఈరోజు రథోత్సవం అంగరంగ వైభవంగా కనుల పండుగ జరిగింది. వేద పండితులు లక్ష్మణ చార్యులు, ఆలయ అర్చకులు జగన్మోహన్ ఆచార్యులు, రఘునాథ ఆచార్యులు, ప్రత్యేక పూజలు అర్చనలు చేసి స్వామివారిని రథంపై కూర్చోబెట్టి పురవీధుల గుండా రథోత్సవం సాగింది. శ్రీ వెంకటేశ్వర భజన మండలి వారిచే భజన కీర్తనలు ఆలకించి, ఎందరును ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కొమ్మల రాధా ఆది రెడ్డి, ఫ్రాక్స్ చేర్మెన్ మహిపతి రెడ్డి, మాజీ సర్పంచులు సామల లావణ్య వేణు, నారాయణ గౌడ్, మాజీ ఎంపీపీ గంగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు బోడగం మల్లన్న, సుర కంటి నాగిరెడ్డి, అనుపురం చిన్న లింబాద్రిగౌడ, కనపర్తి శ్రీనివాస్, ఉట్నూరి గంగాధర్, గ్రామ నాయకులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఉదయం జీవన్ రెడ్డి, మధ్యాహ్నం భోగ శ్రావణి స్వామివారి సేవలో పాల్గొన్నారు.



