కోరుట్ల

సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభం పాల్గొన్న జువ్వాడ కృష్ణారావు

viswatelangana.com

April 3rd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండలంలోని సంగెం, గుమ్లాపూర్, వెంకటాపూర్ గ్రామాలలో జరిగిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అని పేద ప్రజలకు ధనవంతులకు తేడా లేకుండా అందరు సమానమనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. అంతకుముందు గుమ్ములాపూర్ గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ భవన ప్రహరీ గోడ నిర్మాణం కోసం రెండు లక్షల రూపాయలు మంజూరవగా సంబంధిత మంజూరుపత్రాన్ని సంఘ పెద్ద మనుషులకు సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతోపాటు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బోయినపల్లి సత్యనారాయణ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజాం, జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు గడ్డం వెంకటేశం గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖల అధ్యక్షుడు శంకర్, చిట్టిబాబు విట్టల రవీందర్ రెడ్డి బర్గం నరసయ్య వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు రాజేష్, మండల కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎండి నబి, సంగేం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరస తుకారం, మాజీ ఎంపీటీసీ సభ్యులు పోతుగంటి వెంకట్ గౌడ్, మహేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button