సమాజ సేవతోనే మనకు గుర్తింపు

viswatelangana.com
సమాజ సేవతో వచ్చే గుర్తింపు చిరకాలం నిలిచిపోతుందని, కాంగ్రెస్ నాయకులు అన్నం అనిల్ అన్నారు. ఆదివారం కోరుట్ల సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక కార్యకర్తల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కోరుట్ల పట్టణంలో యువత సమాజసేవలో మందంజలో ఉందని అన్ని వర్గాలకు చెందిన యువత కలిసిమెలిసి సమాజ సేవకు కలిసి కదలడం సంతోషమన్నారు. సామాజిక సేవతో వచ్చే మానసిక సంతృప్తికి ఏది సాటిరాదన్నారు. అన్ని మత గ్రంథాలు మానవత్వం చూపుతూ పరులకు సేవ చేయాలని సూచించాయని గుర్తు చేశారు. కోరుట్ల సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సమాజసేవకులకు మంచి ఉత్సాహం అందిస్తుంది అన్నారు. రక్తదానం పేదలకు సాయంగా నిలవడం ఆపద సమయంలో అండగా ఉండడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్న సామాజిక సేవకులు తమ స్ఫూర్తిని అలాగే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నయీమ్, టిఆర్ఎస్ నాయకులు ఫాహీమ్, నజీబుద్దిన్, ఖయ్యూం, బలిక్ సలీం ఫారుకి, ఇలియా అహమ్మద్. ముక్రం చాంద్. సోషల్ సర్వీస్ సొసైటీ నిర్వాహకులు షా ఖాన్, అబూ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.



