కోరుట్ల
సర్పరాజ్పల్లి గ్రామం లో ఉపాధి హామీ పనులు పరిశీలించిన ఎంపీడీవో వోదెల రామకృష్ణ

viswatelangana.com
March 25th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలంలోని సర్పరాజ్పల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను ఎంపిడీవో రామకృష్ణ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు అందరూ వినియోగించుకోవాలని, పనిని నాణ్యంగా చేస్తూ కొలతలు ప్రకారం కూలి పడే విధంగా పనిచేయాలని కోరారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు.త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని వివిధ దశల్లో లక్ష చొప్పున మొత్తం 5 లక్షలు లబ్ధిదారుని ఖాతాల్లో జమచేయడం జరుగుతుంది.వీరి వెంట పంచాయతీ కార్యదర్శి మాధవి ఫీల్డ్ అసిస్టెంట్ లక్పతి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



