కోరుట్ల

సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

viswatelangana.com

August 16th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణ ఆదర్శ నగర్ లో గల శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో, శ్రావణమాసం రెండవ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కళ్యాణ మండపంలో ఉత్సవమూర్తి అమ్మవారిని ఉంచి.. సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఆలయ అర్చకులు ఇందూరి మధుసూదనా చారి, శ్రీ పెరంబుదూరి శ్రీనివాస్, సేనాపతి కృష్ణచంద్ర ల వైదిక నిర్వహణలో నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు. అందజేసారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తుల కోసం అన్ని ఏర్పాట్లతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆలయ నిర్వాహకులు బూరుగు రామస్వామి గౌడ్ మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రావణమాస వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తుల ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఉచిత అన్నదాన కార్యక్రమానికి కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బూరుగు రామస్వామి గౌడ్ తో పాటు ముత్యాల గంగాధర్, చౌటుకూరి అంజయ్య, ఇల్లెందుల వెంకట్రాములు, వెంకటేశ్వరరావు, గంగాధర్, సతీష్, భూమయ్య, పురుషోత్తం, అర్చకులు ఇందుర్తి మధుసూదనా చారి, శ్రీపెరంబుదూరి శ్రీనివాస్, సేనాపతి కృష్ణచంద్ర, భక్తులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button