కోరుట్ల
సీతారామాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి అయ్యప్ప ఆలయ పక్షాన ఒడి బియ్యం, పట్టు వస్త్రాలు

viswatelangana.com
April 17th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
రఘువంశ మహారాజు, శ్రీ రామచంద్రుడు జన్మించిన శుభదినం, పట్టాభిషేకం మరియు సీతారామ కళ్యాణం జరిగిన పర్వదినం చైత్ర శుద్ధ నవమి శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామాలయం, మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి అయ్యప్ప ఆలయ పక్షాన ఒడి బియ్యం, పట్టు వస్త్రాలుసమర్పించడం జరిగిందని అయ్యప్ప దేవాలయం అధ్యక్షులు గురు స్వామి అంబటి శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు తెలిపారు.



