కథలాపూర్
సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ చేసిన వారిపై కేసు నమోదు చేయాలని వినతి పత్రం

viswatelangana.com
March 13th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల అధ్యక్షుడు కయితి నాగరాజ్, వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కాశావత్రి వంశీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో ప్రజా పాలన చేసిన అభివృద్ధిని కొంతమంది బిఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా, అసభ్య పాదజాలంతో ఫేస్బుక్లో పోస్టులు చేయడం సరికాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రమేష్ రావు తన ఫేస్బుక్లో కాంగ్రెస్ ఫై ఇష్టానుసారంగా పోస్టులు చేశారు. వారిపై చట్టరీత్యా కేసు నమోదు చేయాలని ఎస్ఐ నవీన్ కుమార్ కు బుధవారం వినతి పత్రాము అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెలిచల సత్యనారాయణ, తలరి మోహన్ కూన అశోక్, షేక్ గౌరామియా తదితరులు పాల్గొన్నారు.



