సౌకర్యాలు కల్పించడం అభినందనీయంమాజీ మున్సిపల్ చైర్మన్ మోర హాన్మాండ్లు

viswatelangana.com
ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలకు వచ్చే రోగులకు సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హాన్మాండ్లు అన్నారు. సోమవారం రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ కాటి పెల్లి రాంరెడ్డి అందించిన స్టాండ్ ఫ్యాన్,తాటిపాముల వెంకటి కుమారులు అందించిన వీల్ చెర్ ను హాస్పిటల్ కు అందించారు. అనంతరం దాతలను వైద్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ డాక్టర్ వోడ్నాల శశికాంత్ రెడ్డి,వైద్యులు వోడ్నాల రజిత,అనిల్, శ్రీకాంత్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు మచ్చ శేఖర్,మాజీ జడ్ సీలు మ్యాకల రమేష్,బత్తిని భూమయ్య, ప్రధాన కార్యదర్శి కడుకుంట్ల నరేష్,కోశాధికారి కట్ల నర్సయ్య,లయన్స్ సభ్యులు ఏద్దండి దివాకర్, కట్కాకం కళ్యాణ్, కొత్తపెల్లి రంజిత్,బొడగం అంజిరెడ్డి,బెక్కం తిరుపతి, సాంబారు శ్రీనివాస్,ల్యాబ్ టెక్నీషియన్ మోసారపు సంతోష్,స్టాఫ్ నర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



