కథలాపూర్
స్కూల్ బస్సు ఢీకొని వృద్ధుని మృతి

viswatelangana.com
March 13th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొని వృద్ధుడు మృతిచెందిన ఘటన కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో జరిగింది స్థానికుల వివరాల ప్రకారం పోసానిపెట్ గ్రామానికి చెందిన మొగుళ్ళ ఎర్రయ్య 70 ఉదయం హోటల్ వద్ద టీ తాగి ఇంటికి వెళుతున్న క్రమంలో ప్రైవేట్ స్కూల్ బస్సు రివర్స్ వెళుతూ కొట్టింది ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఎర్రయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యన మృతి చెందాడని ఎస్ఐ నవీన్ కుమార్ తెలియజేశారు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలియజేశారు తెలియజేశారు



