స్త్రీలను పూజిస్తే దేవతలు సంతోషిస్తారు

viswatelangana.com
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విస్డం హైస్కూల్లో వైభవంగా నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస పోటీలు, మహిళా ఉపాధ్యాయులకు ఉపన్యాస పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నివేదిత రాజు రెడ్డి మాట్లాడుతూ సనాతన భారతీయ సంస్కృతిలో స్త్రీని మాతృమూర్తి గా శక్తి స్వరూపిణిగా జగన్మాతగా గౌరవించే సంప్రదాయం అనాదిగా ఉందని అందుకే “యాత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతా:” స్త్రీలను పూజిస్తే దేవతలు కూడా సంతోషిస్తారని పెద్దలు ఉద్భోదించారన్నారు. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని ఐక్యరాజ్యసమితి చెప్పినట్లుగా మహిళా సాధికారత ఇంకా అవసరమన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.



