హిమ్మత్రావుపేటగ్రామంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని హిమ్మత్రావుపేట గ్రామంలో ఐసిడిఎస్ మల్యాల ప్రాజెక్టు ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మల్యాల ప్రాజెక్టు ఏ సి డి పి ఓ అరవింద, కార్యక్రమానికి విచ్చేసిన తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ సున్నా నుండి ఆరు సంవత్సరాల లోపు పిల్లల్లో మెదడు అభివృద్ధి చాలా వేగంగా 90% జరుగుతుందని కాబట్టి అంగన్వాడీ కేంద్రానికి తప్పనిసరిగా పంపించాలని మరియు నూతన విద్యా విధానం లో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో సిలబస్ తో కూడిన విద్యను అందించబడుతుంది ప్రభుత్వం వారిచే సరఫరా చేయబడిన ప్రీస్కూల్ మెటీరియల్. అంగన్వాడీ టీచర్స్ తయారుచేసిన వేస్ట్ మెటీరియల్ తో తయారు చేసిన టిఎల్ఎం ను ఉపయోగిస్తూ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించడం జరుగుతుంది అందుకని అందరు కూడా అంగన్వాడీ కేంద్రానికి పిల్లల్ని పంపించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిమ్మత్రావుపేట మాజీ సర్పంచ్ కృష్ణారావు, తల్లులను ఉద్దేశించి అంగన్వాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యతో పాటుగా మంచి పోషక ఆహారం అందించబడుతుందని పిల్లలు ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలలో అభివృద్ధి కుంటు పడకుండా ఉంటుందని ప్రతి నెల పిల్లల విడుదల పర్యవేక్షణ చేయడంలో పోషకాహార లోపం తో ఉన్న పిల్లలను గుర్తించడం జరుగుతుందని కాబట్టి అంగన్వాడీలో లభించే పోషకాహారాన్ని అందరు కూడా తప్పనిసరిగా తీసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కొడిమ్యాల సెక్టార్ సూపర్వైజర్ ఉమా, చైల్డ్ మ్యారేజ్ కోఆర్డినేటర్ లహరి హిమ్మత్రావుపేట కార్యదర్శి భార్గవి, రామ్ సాగర్ పీహెచ్సీ ఎంఎల్ హెచ్ పి నవనీత, అంగన్వాడీ టీచర్స్ రాజమణి, సుశీల, పుష్ప, మౌనిక, కనకమ్మ, ఏఎన్ఎం రాజశ్రీ, ఆశ కార్యకర్తలు అంగన్వాడి హెల్పర్స్ పిల్లలు తల్లులు పాల్గొనడం జరిగింది



