రాయికల్

24 సంవత్సరాల సర్వీసు పూర్తయిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించాలి…

టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కి వినతిపత్రం, భగవద్గీత అందజేసిన ఆర్.యు.పి.పి. రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్...

viswatelangana.com

June 3rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ సహాధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి చంద సత్యనారాయణ లు రెండు వినతి పత్రాలు సమర్పించి భగవద్గీత ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. ఈ వినతిపత్రం లో 1/2005 అక్ట్ రద్దు చేసి భాషోపాధ్యాయులకు నియామకం తేది నుండి నోషనల్ సర్వీస్ ప్రొటెక్షన్ కల్పించాలని, 24 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు గెజిటెడ్ హెూదా కల్పించాలని ప్రాథమిక పాఠశాల ల్లో హిందీని ప్రవేశపెట్టి తెలుగు హిందీ పండితులను నియమించి, మిగిలిన భాషాపండితులందరికి పదోన్నతులు కల్పించాలని, 60% పి.ఆర్.సి ని ప్రటింపజేసి పెండింగ్ డి.ఎ. లు, పెండింగ్ బిల్లులు మంజూరు చేయించాలని, అలాగే అపార్ ఐడి నేపథ్యంలో విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదిలు మార్పులు చేర్పులకు ప్రభుత్వం అనుమతించిన వాటిని యస్.యస్.సి బోర్డు లో అప్ డేట్ చేయకపోవడంతో ప్రస్తుతం పాసైన పదవ విద్యార్థులు ఇంటర్ తదితర పై చదువుల కై అడ్మీషన్ తీసుకోవడంలో ఆటంకాలు, వారి చదువు ఆగిపోయే ప్రమాదం నేపథ్యంలో ఇట్టి విషయాన్ని అత్యవసరంగా భావించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.

Related Articles

Back to top button