రాయికల్
ఆర్థిక సహాయం అందజేత

viswatelangana.com
March 29th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
చందుర్తి మండలంలోని జోగాపూర్ గ్రామానికి చెందిన మహేందర్ ఇటీవలే అనారోగ్యంతో మరణించగా శనివారం దుబాయ్ ఫోర్స్ 10 కంపెనీ గ్రూపు సభ్యులు కలిసి జమ చేసిన రూ.10,500 లను రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన తోకల రవీందర్ మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. దుబాయిలో మహేందర్ మేము ఓకే కంపెనీలో పనిచేసే వారమని, దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరమని, వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కష్టాల్లో ఉన్న దుబాయ్ ఫోర్స్ 10 కంపెనీ గ్రూపు సభ్యుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు.



