కథలాపూర్
ఎస్ఆర్ఎస్పి వరదకాలువ మోటార్ వైర్లు దొంగిలించారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఊట్ పల్లి గ్రామ రైతులు

viswatelangana.com
January 20th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
ఊట్ పల్లి గ్రామ రైతులు మాట్లాడుతూ ఊట్ పల్లి కి పెగ్గెర్ల కు మధ్యలో ఉన్న వరదకాలువకు మోటార్లు పెట్టుకొని పంటలు సాగు చేసుకుంటున్నామని,ఈ నెల 18వ తేదిన 15 మందికి పైగా రైతుల యొక్క మోటార్ల కాపర్ వైర్లను దొంగలు కత్తిరించి తీసుకెళ్లారని ఈ దొంగతనాలు రెండవ సారి కావడంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని దయ చేసి దొంగతనాల నివారణకు పోలీస్ శాఖ తరపున తగు చర్యలు తీసుకోవాలని ఎస్సై గారికి ఫిర్యాదు చేసినట్లు రైతులు చెప్పారు ఏజిబి మహేందర్, తొగరి రాజేంధర్,చిన్న నర్సయ్య, తొగరి గంగారాం, కర్రోల చిన్న గంగారెడ్డి, కర్రోల గంగారెడ్డి , మొరపు రాజారెడ్డి లు తెలిపారు.



