కోరుట్ల

అఖిల భారత విద్యార్థుల సదస్సును

_ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్_

viswatelangana.com

February 21st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తు విద్యా కాషాయకరణ కార్పొరేటీకరణను ప్రేరేపిస్తూ శాస్త్రీయ విద్య స్థానంలో మనువాద సిద్ధాంతాన్ని అమలు పరిచేదిశలో నూతన జాతీయ విద్యా విధానం 2020 ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నదనిఅన్నారు తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు భారత్ బచావో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పేట భాస్కర్ ఆరోపించారు. కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సదస్సుకు సంబంధించిన పోస్టర్లను కరపత్రాలను ఓయూ కేయూ విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి పేట భాస్కర్ ఆవిష్కరించారు. ఈసందర్బంగా పేట భాస్కర్ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఈనెల 25, 26 తేదీలలో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు బుద్ధి జీవులు మేధావులు, ప్రొఫెసర్లు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు రెండు రోజులపాటు ఈ సదస్సులో పాల్గొని NEP-2020 వలన బడుగు బలహీన అణగారిన వర్గాలకు విద్య వ్యవస్థలో జరిగే నష్టాలను ఈ చర్చలో వివరిస్తారని పేట భాస్కర్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫిలాసఫి పరిశోధక విద్యార్థి అజాద్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేశారనీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020తో పాటు నూతన విద్యా పాఠ్య ప్రణాళిక2023ను తీసుకొచ్చి స్వేచ్ఛ సమానత్వం లౌకితత్వం అనే రాజ్యాంగ విలువల స్థానంలో మనుధర్మన్ని అమలుచేసే ప్రయత్నము చేస్తున్నారని డార్విన్ సిద్ధాంతాన్ని తొలిగిస్తాం హెడ్గేవర్ పాఠాన్ని ప్రవేశ పెడతాం అని చెప్తున్నారనిపెద మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసే ఇలాంటి ప్రయత్నంలో దేశ వ్యాప్త విద్యార్థులందరిని ఏకం చేసి సమాన శాస్త్రీయ విద్య కావాలని అంద విశ్వసలను పెంచే విద్య విధానాలు వెనక్కి తీసుకోవాలని అజాద్ డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో భారత్ బచావో జిల్లా కో – ఆర్డినేటర్ పిట్టల నారాయణ జిల్లా సలహాదారు మహ్మద్ షేక్ ప్రజాసంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షులు బోనగిరి మల్లారెడ్డి టిఏవైఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జెల రాజు మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు మ్యాదరి శ్రీవారి భారత్ బచావో జిల్లా కౌన్సిల్ సభ్యులు రాజాగౌడ్ చిట్యాల అన్వేష్ ఎఐఎస్ఎప్ జిల్లా అధ్యక్షుడు అక్రమ్ ముసేప్ విద్యార్థి సంఘాల రాష్ట్ర నాయకులు శ్రావణ్ గణేష నాగరాజు జయసూర్య విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button