కోరుట్ల

కోరుట్లలో మధ్యాహ్న భోజన సహాయకులకు శిక్షణ కార్యక్రమం

viswatelangana.com

June 10th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత మరియు మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు మరియు మధ్యాహ్న భోజన సహాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గంగుల నరేశం మాట్లాడుతూ, ప్రతి పాఠశాల పరిసరాలు, వంట పాత్రలు, త్రాగునీరు, వంట సామాగ్రి శుభ్రంగా ఉండాలని, విద్యార్ధులకు వేడిగా, పౌష్టికమైన ఆహారం అందించాలని సూచించారు. రోజువారీ మెనూను తప్పకుండా పాటించాలి అని అన్నారు. మాధ్యాహ్న భోజన సహాయకులకు కూడా గ్లౌజులు ధరించాలని చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి మార్గం రాజేంద్రప్రసాద్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్. కృష్ణ మోహన్, సి.ఆర్.పి లు పి.గంగాధర్, జ్యోతి మరియు ఇతర ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.ఈ శిక్షణ కార్యక్రమం విద్యార్థులకు సరైన ఆహారం అందించడంలో కీలక పాత్ర పోషించనుంది.

Related Articles

Back to top button