కోరుట్ల

మన ప్రెస్ క్లబ్ నూతన ట్యాగ్ లను ఆవిష్కరించిన ఆర్డీవో ఆనంద్ కుమార్

viswatelangana.com

March 15th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్యాగ్ లను శుక్రవారం కోరుట్ల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్డీవో ఆనంద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రెస్ క్లబ్ పాత్రికేయులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులకు నాయకులకు తెలియజేసేలా వార్త కథనాలు ప్రచురించాలని పేర్కొన్నారు. సమాజంలో జరిగే అవినీతిని వెలికి తీసేందుకు పాత్రికేయ వృత్తి ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. అనంతరం మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్ ఆర్డిఓ ఆనంద్ కుమార్ కు, బహుకరించారు. మనం దినపత్రిక ప్రాంతీయ కార్యాలయంలో ఎంపీపీ తోట నారాయణ కు మనం దినపత్రిక డైరీని బహూకరించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కేర చంద్రశేఖర్, మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అల్లే రాము, మన ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారులు కటుకం గణేష్, ఉపాధ్యక్షులు లింగ ఉదయ్ కుమార్, కొండ్లెపు అర్జున్, వనతడుపుల నాగరాజు, కత్తి రాజ్ శంకర్, బాలే అజయ్, గిన్నెల శ్రీకాంత్, గుడిసె కోటేష్, కోడూరి ప్రేమ్, మ్యాకల సూర్య ప్రకాష్, తుమ్మల శేఖర్, సంగ మహేష్, బెజ్జారపు ఉమేందర్, మంచి కట్ల విజయ్ తదితరులున్నారు.

Related Articles

Back to top button