మేడిపల్లి

మేడిపల్లిలో కృతజ్ఞత ర్యాలీ పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

viswatelangana.com

January 18th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
మహిళా సంఘ భవనం మంజూరుకు హామీ

గురువారం మేడిపల్లి మండల కేంద్రంలో కృతజ్ఞత ర్యాలీలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. మేడిపల్లి మండల కేంద్రంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా విజయానికి అహర్నిశలు కృషి చేసిన మేడిపల్లి మండలప్రజలతో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి గొప్ప విజయాన్ని కట్టబెట్టిన మీకు రుణపడి ఉంటాను అన్నారు. మీరు ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తే ప్రభుత్వ పెద్దలు తనకు ప్రభుత్వ విప్ గా మరో మెట్టేక్కించారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం మొదట గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందని తెలిపారు.రాజీవ్ ఆరోగ్య శ్రీపథకం కింద 10 లక్షల వరకు అమలు చేశామన్నారు. నా గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..

Related Articles

Back to top button