కథలాపూర్
ఘనంగా దుర్గమ్మ బోనాలు

viswatelangana.com
April 26th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలంలోని ఇప్పపల్లి గ్రామంలో దుర్గాదేవి నూతన దేవాలయం నిర్మించి దుబ్బుల వారి ఆధ్వర్యంలో విగ్రహం ప్రతిష్ట జరిగింది మరియు పోతారాజుల ఆధ్వర్యంలో గ్రామస్తులు బోనాలు తీసి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు యాగండ్ల మధు గౌడ్, బొండ్ల నారాయణ, చెన్నమనేని కృపాల్ రావు, గండ్ర విజయ్ రావు, కొలి నరేందర్ రెడ్డి, మండలోజి నరేష్ చారి, మర్రిపల్లి గణేష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు



