ప్రగతి హై స్కూల్ లో ఘనంగా స్పోర్ట్స్ మీట్
viswatelangana.com
రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో క్రీడలు ప్రారంభమైనాయి. కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ తదితర క్రీడలను మున్సిపల్ చైర్మన్, ఎమ్మార్వో, జెడ్పిటిసి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో పరిచయం నిర్వహించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఒలంపిక్స్ పతాకాన్ని ఎగురవేసి, క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం శాంతి కపోతాలను ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక దృఢత్వ ముతోపాటు, మానసిక ధైర్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. అనంతరం ఎమ్మార్వో మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు, క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. జెడ్పిటిసి జాదవ్ అశ్విని మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని, క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రెస్ జేఏసీ అధ్యక్షుడు వాసరి రవి మాట్లాడుతూ క్రీడల వల్ల పిల్లలలో గెలవాలనే తపన పెరుగుతుందని అన్నారు. అనంతరం క్రీడల్లోని విజేతలకు మెడల్స్ తో పాటు విన్నర్, రన్నర్ ట్రోపీలను అందజేశారు. విద్యార్థినిలు ప్రదర్శించిన పిరమిడ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ బాలె జయశ్రీ శేఖర్, పాఠశాల అకాడమీ డైరెక్టర్ నిఖిల్ కుమార్,రెండవ వార్డు కౌన్సిలర్ కన్నాక మహేందర్,ప్రెస్ జేఏసీ ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్, ఉపాధ్యక్షుడు చింతకుంట సాయికుమార్, సంయుక్త కార్యదర్శి గంగాధరి సురేష్, జేఏసీ సభ్యుడు కిరణ్ రావు, గోపాల్ రెడ్డి, పాఠశాల పోషకులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



