రాయికల్
రాయికల్ మండల విద్యాధికారికి టీ అర్ టీ ఎఫ్ సన్మానము
viswatelangana.com
September 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండల విద్యాధికారిగా పదవీబాధ్యతలు స్వీకరించిన శ్రీపతి రాఘవులు ను తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాయికల్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. నూతన బాధ్యతలు స్వీకరించిన శ్రీపతి రాఘవులు ఆధ్వర్యంలో మండల విద్యావ్యవస్థ మరింత ప్రగతి పథంలో ముందుకెళ్లాలని, నాయకులు ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. ఈకార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లె చిన్నయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్, మండల అధ్యక్షులు ఎలిగెేటి రాజకిశోర్ నాయకులు ముక్కెర శేఖర్, గుట్ట సత్యనారాయణ, కూరగాయల సురేష్, మేరుగు ప్రగతి తదితరులు పాల్గొన్నారు.



