జగిత్యాల
వర్తమాన అంశాలపై చర్చించిన ఎన్నారై మరియు జగిత్యాల ఎమ్మెల్యే
viswatelangana.com
January 24th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల పట్టణ రాంబజార్ వాస్తవ్యులు ఎన్నారై 26దేశాల్లో 50వేల మంది ఉద్యోగులు కలిగి ఉన్న అప్లైడ్ మెటీరియల్స్ సంస్థ కు వైస్ ప్రెసిడెంట్ నలుమాసు ఓంకార్ జగిత్యాల కు రాగా వారిని మర్యాద పూర్వకంగా కలిసి అల్పాహార కార్యక్రమం లో పాల్గొనీ వర్తమాన అంశాలపై చర్చించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్.ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులు మంచాల కృష్ణ,బట్టు శ్యామ్ సుందర్, నలుమాసు రామ్ మనోహర్, రాచకొండ నరేందర్, జిడిగే పురుషోత్తం, గట్టు వామన్, తదితరులు పాల్గొన్నారు.



