జన్మదినం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండల & పట్టణ బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో తెంగాణా జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి, కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా స్థానిక హనుమన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. తర్వాత స్థానిక ప్రభుత్వ హైస్కూల్ యందు పదవ తరగతి విద్యార్ధిని, విద్యారులకు పరీక్షలకు సిద్ధమౌతున్న సందర్భంలో ఎగ్జామ్స్ ప్యాడ్స్ పంపిణీ చేసి రానున్న బోర్డు ఎగ్జామ్స్ లో మేరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల & పట్టణ శాఖ అధ్యక్షులు బర్కం మల్లేష్,ఎలిగేటి అనిల్ కుమార్, మండల & పట్టణ కో- ఆర్డీనేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ ఏఎంసి ఛైర్మన్లు ఎలుగందుల ఉదయశ్రీ, మారం పెల్లి రాణి, మండల ప్రధాన కార్యదర్శులు కొండపల్కుల రత్నాకర్ రావు, మహేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు మారంపెల్లి సాయి కుమార్ , కన్నక మహేందర్,మాజీ ఏఎంసి వైస్ ఛైర్మన్ కొల్లూరి వేణు, మాజీ ఎంపీటీసీ రాజేందర్ గౌడ్ ,నాయకులు ఆంత్రం శ్రీనివాస్, ఇంతియాజ్, శ్రీరాముల సత్యనారాయణ, ప్రతాప్ రెడ్డి, సంతోష్ రావు, వెంకటేష్ నాయక్, సుతారి తిరుపతి, బాబా,కిట్టు, అలుపట్ల లక్ష్మణ్, భూక్య లక్ష్మీ, జలపతిరెడ్డి,నరేష్, శంకర్ నాయక్, మూజహిత్, బాపన్న, రాంచంద్రం, గణేష్, లక్ష్మణ్, వినోద్, మహేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.



