మెరుగైన ఫలితాలు సాధించాలి- ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ రెడ్డి
viswatelangana.com
పాఠశాలల పర్యవెక్షణ లో భాగంగా వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కే.సత్యనారాయణ రెడ్డి గారు జగిత్యాల జిల్లా విద్యాధికారి కార్యాలయాన్ని మరియు జగిత్యాల మండలం లోని ధరూర్ క్యాంప్ ఉన్నత పాఠశాల ను ఆకస్మికంగా సందర్శించారు. రానున్న పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు అందరూ 100 శాతం ఉతీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రణాళిక బద్దంగా విద్యార్థులను చదివించాలని, ఉదయం సాయంత్రం తరగతులకు పిల్లలందరూ హాజరయ్యేలా చూడాలని సూచించారు. పాఠశాలలోని అన్ని తరగతుల మార్క్స్ రిజిస్టర్ లను, విషయాల వారీగా నిర్వహించిన వారంత పరీక్షల ఆన్సర్ పేపర్ లను పరిశీలించారు. తర్వాత పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల తో మాట్లాడుతూ ప్రతి రోజూ విధిగా పాఠశాలకు రావాలని , ఎప్పటికప్పుడు వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకొని ఉత్తమమైన జి పి ఎ ను సాధించాలని సూచించారు.దీనిలో జిల్లా సెక్టరియల్ అధికారి కొక్కుల రాజేశ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మి నారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




