రాయికల్
పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డి.ఎస్.పి

viswatelangana.com
December 9th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ స్టేషన్ను జగిత్యాల డి.ఎస్.పి రఘు చందర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణ, నేరాల నమోదు మరియు సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకుని, పోలీస్ స్టేషన్ను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి, రాయికల్ ఎస్సై సుదీర్ రావు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.



