జిల్లా సెక్టోరియల్ అధికారులు తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం సందర్శన

viswatelangana.com
కోరుట్ల మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాల యూసుఫ్ నగర్ అలాగే కోరుట్ల పట్టణంలోని మండల పరిషత్ అంబేద్కర్ నగర్ పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశంలో జిల్లా సెక్టోరియల్ అధికారులు కొక్కుల రాజేశ్, మహేష్ లు పాల్గొని వారు మాట్లాడుతూ… ప్రతి 3వ శనివారం ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం విధిగా నిర్వహించాలని, నేటి సమావేశం టిమ్ బాధ్యత గల పౌరులను తీర్చిదిద్దడం అంశంపై మాట్లాడుతూ… విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను భాధ్యత గల పౌరులుగా తీర్చిదిధ్దడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనదని తెలిపారు. విద్యార్థులలో స్వేచ్ఛ, బాధ్యత, గౌరవం, దయ విలువలను పెంపొందించడంలో తల్లిదండ్రులు భాగస్వామ్యం వహించాలని, విద్యార్థుల ప్రగతిపై చర్చించారు. ఇంటింటా చదువుల పంట యాప్ ను తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈసమావేశంలో విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్షించారు. ఆగస్టు 15న బడిలో స్వాతంత్ర్య వేడుకలు ఎలా జరిగాయో.. తల్లిదండ్రులతో వివరించారు. ఇంటి వద్ద తమ పిల్లల కోసం అభ్యసన స్థలాన్ని ఏర్పరచాలన్నారు. పాఠశాల రికార్డు, రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సమావేశంలో మండల విద్యాధికారి గంగుల నరేశం, జి.మధుసూదన్ రావు, సి.ఆర్.పి మంగ కార్తిక్ లు పాల్గొన్నారు.



