కోరుట్ల
జగిత్యాలలో జిల్లా స్థాయి యోగ పోటీలలో కోరుట్ల గురుకుల విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక

viswatelangana.com
August 18th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మేనేజ్మెంట్ సౌజన్యంతో శుక్రవారం రోజు జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లాలో వివిధ మండలాలు, గ్రామాల నుంచి 100 మంది యోగా శిక్షణ విద్యార్థులు పాల్గొనగా అందులో భాగంగా కోరుట్ల టీ.జీ.ఎస్.డబల్యూ.ఆర్.ఎస్, కోరుట్ల లింగమ్మ గార్డెన్ గురుకుల పాఠశాల (బాయ్స్ ) 12 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి యోగ శిక్షణకి ఎంపిక అయ్యారు.. అద్భుతమైన యోగా ప్రదర్శన చేసి, జడ్జిలతో మంచి మార్కులే కొట్టేశారు. ఇందులో నాలుగురు గోల్డ్ మెడల్, మరో నలుగురు సిల్వర్ మెడల్, మరో నలుగురు బ్రాంచ్ మెడల్ లు సాధించారు. మిగతా విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్స్ అందజేసారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బండి బాబు, వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్, మానస, పీడీ పిటి లు జగన్, అజయ్ పాల్గొన్నారు.



